ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో మంత్రి రోజా నగరిలో వెనకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ లీడింగులో ఉన్నారు. స్థానికంగా సొంత పార్టీ నేతల నుంచే ఆమె అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. తన గెలుపుకు సొంత నేతలే సహకరించడం లేదని పోలింగ్ రోజున రోజానే స్వయంగా చెప్పారు. మైదుకూరు TDP అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ లీడింగులో కొనసాగుతున్నారు. అక్కడ YCP MLA రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు.