Trending Now

సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గాన్ని అనుసరించాలి : మంత్రి సీతక్క

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదారాబాద్ కొంపెల్లి లో సంత్ సేవాలాల్ మహారాజ్‌ను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారని అన్నారు. ఆయన పరమపదించి దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అహింసా మార్గాన్ని అవలంభించాలని, అనర్ధాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు సేవాలాల్ మహారాజ్ గొప్పతనం గురించి, ఆయన చేసిన బోధనలు భవిష్యత్ తరానికి సైతం అందేలా కృషి చేయాల్సిన బాధ్యతను మనపై ఉందని.. ఆ విధంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News