ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని, ఏ పాలకులను ఎంచుకోవాలి అనేది ఓటు మీద ఆధారపడి ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.