Trending Now

ఇచ్చినా మాటను తప్పకుండా చేసి చూపిస్తాం..

ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 29 : ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీను బాబు అన్నారు. పెద్దపల్లి పార్లమెంటల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సోమవారం సెంటినరీ కాలనీలోని శ్రీ సత్య ఫంక్షన్ హాల్ లో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రామగిరి, కమాన్పూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి దుద్దిళ్ళ శ్రీనుబాబు పాల్గొన్నారు. ముందుగా ప్రచార కార్యక్రమం పై వివిధ గ్రామాల వారీగా ఏకాభిప్రయాన్ని సేకరించిన తిరుపతి యాదవ్ ఎండ తీవ్రతలు అధికమవుతున్నందున మే 2న ఉదయం కమాన్పూర్ మండలంలో, సాయంత్రం రామగిరి మండలంలో ప్రచార కార్నర్ మీటింగ్ ని నిర్వహించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ని మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్ణయించనున్నట్లు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ తెలిపారు. అనంతరం కార్యకర్తలతో ముచ్చటించిన శ్రీనుబాబు ఆప్తుల మధ్య అంతరాలు ఎందుకంటూ.. కింద కూర్చొని మాట్లాడారు. 8 సార్లు మా దుద్దిళ్ళ కుటుంబాన్ని ఆదరించారని, అందులో 5 సార్లు శ్రీధర్ బాబునీ గెలిపించి అసెంబ్లీకి పంపినా మంథని ప్రజల కంటే మా కుటుంబానికి ఆప్తుల ఎవరు లేరని, మంథని ప్రజానీక రుణాన్ని ఎన్నడూ మరవలేమన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు చెప్పినట్లుగానే ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధినీ 70ఏంఏంలో చూపిస్తామన్నారు. నాలుగు నెలల కాలంలోనే 300కోట్ల నిధులతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాట్లు గుర్తు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి సంక్షేమం మరింతగా సాధ్యపడుతుందని, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలంటే పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణనీ గెలిపించుకునే భాధ్యత అందరిపై ఉందన్నారు. దివంగత నేత గడ్డం వెంకటస్వామి మనవడిగా ఆయన మార్గంలో నడిచే, ప్రతిభశిలీ, యువకుడు ఉత్సహవంతుడు గడ్డం వంశీక్రిష్ణ ఇది వరకే పారిశ్రామిక రంగంలో తనదైన ముద్రను వేశారన్నారు. స్వంతంగా సంస్థ నీ ప్రారంభించి 500మందికి ఉపాధి కల్పించడమే కాక, ఇక్కడి సింగరేణి ప్రాంత ఉద్యోగుల కుమారులకు సైతం ఉధ్యోగావకాశాలు ఇచ్చినట్లు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వంశీ మెజారిటీలో మంథని మొదటి స్థానంలో నిలవాలనీ, మంత్రి శ్రీధర్ బాబును గెలిపించిన తీరుగానే, ఎంపీగా వంశీక్రిష్ణ నీ గెలిపించుకునే భాధ్యతను అందరు తీసుకోవాలని సూచించారు.

గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలానలో అభివృద్ధిని గాలికొదిలి అక్రమార్జనకు తెర లేపారనీ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు కట్టి నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేసిన కొప్పుల ఈశ్వర్ కీ ఓట్లు అడుగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కీ గడచిన ఎన్నికల్లో ప్రజలు గట్టి సమాధానం ఇచ్చిన, నాలుగు నెలలైన పూర్తి కాకముందే తన అక్కసును వెళ్లగక్కుతున్నారాన్నారు. మీ ఇంట్లో చిన్న కొడుకుగా ఆశీర్వాధించి, ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ లో ఈ ప్రాంత గళం అవుతనానీ, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధికి, పరిశ్రమలను స్థాపనకు కృషి చేస్తాననీ అన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి, కమాన్పూర్ మండలాద్యక్షులు రోడ్డ బాపు, వైనాల రాజు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య, చోప్పరి సదానంధం, రామగిరి ఎంపీపీ ఆరెళ్ళి దేవక్క కొమురయ్య గౌడ్, కమాన్పుర్ పీఏసిఎస్ చైర్మన్ ఇనుగంటి భాస్కర్ రావు, ఎంపీటీసీలు కొప్పుల గణపతి, కొట్టే సందీప్, తీగల స్వప్న సమ్మయ్య, మాజీ సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జెమినీ గౌడ్, బర్ల శ్రీనివాస్, నాయకులు ఎల్లే రాంమూర్తి, మైదం వరప్రసాద్, గంట వెంకటరమణారెడ్డి, ముస్త్యలా శ్రీనివాస్, కాటం సత్యం, దాసరి శివ, అట్టే తిరుపతి రెడ్డి, ఉడుత శంకర్, మట్ట రాజ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్లు, మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News