ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం రాత్రి ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడి ప్రత్యేక సెల్‌లో ఆమెను ఉంచారు. ఇక శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. కాగా కవిత తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.