ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కవిత అక్రమ అరెస్టుపై బీఆర్‌ఎస్ కన్నెర్ర చేసింది. అరెస్టుకు నిరసనగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రహదారులపై బైఠాయించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల జెండాలు చేతబట్టి బైఠాయించిన నేతలు.. వెయ్యి మంది మోదీలు, రేవంత్‌లు వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి మచ్చలేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తారని నమ్మకం వ్యక్తంచేశారు.