MLC Kavitha Bail Petition Supreme Court: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. మార్చి 15 వ తేదీన అరెస్ట్ అయిన ఆమె అప్పటినుంచి తీహార్ జైలులోనే ఉంటున్నారు. ఇప్పటికే ఆమె పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైంది. తాజాగా, ఆమె సుప్రీంకోర్టు ఆశ్రయించగా..ఈనెల 20న విచారించిన అనంతరం ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.
ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావులు ఢిల్లీకి బయలుదేరారు. వారితో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఢిల్లీ పయనమయ్యారు. కవిత బెయిల్ కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.