Trending Now

ధర్నాలు చేసేది రైతులు కాదు.. బీఆర్‌ఎస్ నేతలు

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ధర్నాలు చేసేది రైతులు కాదు.. బీఆర్‌ఎస్ నేతలని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు వరి ధాన్యం విషయంలో ధర్నాలు చేస్తున్నారు.. సిగ్గు అనిపించడం లేదా..? పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు.. ఏం వెలగబెట్టారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ రైతులకు జ్ఞాపక శక్తి లేదని అనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులతో ఎలా ప్రవర్తించారో చూశాం.. ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేసి కొట్టుకుంటూ తీసుకువెళ్ళారు. నేరెళ్ళ రైతులు కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతున్న ఇసుక మాఫియా అడ్డుకుంటే దాడులు చేశారని ఆయన గుర్తు చేశారు.

పంట నష్టపోతే రైతులను పరామర్శించలేదు. మేము ధర్నా చేస్తే రైతులు ఆదరిస్తారు అని అనుకుంటున్నారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్.. ఆయన ఫాం హౌస్ లో వరి వేసుకోలేదా..? రైతులకు పదేళ్లలో బాసటగా నిలువలేదు. ఎన్నికల సమయంలో తాయిలాలు ఇవ్వడం పది రెట్లు రైతులను ముంచడం చేశాడన్నారు. గత ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి లోనే ఐకేపీ సెంటర్లు తెరుచామని.. గత ప్రభుత్వం కన్న ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చే ప్రభుత్వం మాది కాదు. ప్రజలు ఈ నాలుగు నెలల పాలనలో సంతోషంగా ఉన్నారు. సిగ్గు లాజ్జ లేకుండా ధర్నాలు చేస్తున్నారు. రైతులకు రేవంత్ రెడ్డి త్వరలో తీపి కబురు అందజేస్తారు. ఆచరణకు సాధ్యం కానీ హామీలు కాంగ్రెస్ ఇవ్వదు. కేసీఆర్ అప్పులతో.. చిప్ప చేతికి ఇచ్చి వెళ్లిన ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో తుడుచుకు వెళ్తున్నారు కాబట్టి ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు. కల్లల వద్ద పడిగాపులు కాచి ప్రాణాలు వదిలిన రైతులు ఎంతమందో.. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. దేశంలోనే తెలంగాణ కేసీఆర్ హయాంలో రైతు ఆత్మహత్యల్లో రెండవ స్థానం లో ఉంది.

కేసీఆర్ జిమ్మిక్కులు నమ్మకండి. పదేళ్లలో బీజేపీ ప్రజలకు ఏం చేసిందో బీజేపీ నాయకులు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే పేదలకు మేము జరుగుతుంది అని ప్రజలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కి వస్తున్నాయి.. ఎటువంటి సంశయం లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేయని వాఖ్యలను అన్నట్లుగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 6 నుంచి పది కిలోల తరుగు తీశారు. మిల్లర్లకు లబ్ధి చేకూర్చి కమిషన్లు తిన్నారు. పీసీసీ చీఫ్ పదవి అడిగే హక్కు ప్రతి కార్యకర్తకు ఉంది. నేను సీనియర్ కార్యకర్తను.. నేను ప్రయత్నాలు చేస్తున్నాను. ఎవరికి అర్హత ఉంటే వాళ్లకు అధిష్టానం పీసీసీ పదవి కట్టబెడుతుంది. నా కన్నా ఎక్కువ అర్హతలు ఎవరికైనా ఉంటే వారికే ఇస్తుందని తెలిపారు.

Spread the love

Related News

Latest News