ప్రతిపక్షం, సినిమా: సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మొగలిరేకులు సీరియల్ ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్ స్టా ద్వారా తెలిపారు. అతడిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే దయ చనిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్ స్టా పోస్టుపై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది ?.. దయ ఎలా చనిపోయాడు ? ఎప్పుడు జరిగింది ? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో పవిత్రనాథ్ పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే తన ఇంటికి చాలా మందిని తీసుకువచ్చేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. అలాగే తన అత్తామామలు కూడా తనను వేధించేవారని పవిత్రనాథ్ భార్య ఆరోపించింది.