Trending Now

మార్పులు పేర్లలో.. ముద్రలలో కాదు రాష్ట్రంలో తీసుకురండి..

నిర్మల్ పట్టణ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హాజీ కమిటీ మాజీ సభ్యులు మొహమ్మద్ నజీరుద్దీన్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 31 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు నెలల పాలన కాలం అంతా వృధాగా గడిచిపోయిందని బీఆర్ఎస్ నిర్మల్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర హాజీ కమిటీ మాజీ సభ్యులు మొహమ్మద్ నజీరుద్దీన్ ఆరోపించారు. ఆరు నెలలలో నాలుగు నెలలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను విమర్శించడం అవహేళనగా మాట్లాడడం చేసింది తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మిగిలిన మూడు నెలలు మాత్రం ఆయన గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పట్ల విమర్శలు చేయడం లేనిపోని అపోహాలు సృష్టించి ప్రజల ఆలోచన ధోరణిని మన్నించడం తప్ప రాష్ట్ర సంక్షేమం కోసం తీసుకుంటున్న పక్కా నిర్ణయాలు ఏమీ లేవని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఈ నెల రోజుల నుంచి మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నట్లు ఉందని చెప్పారు. ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల అభిప్రాయాలను సేకరించి రూపొందించిన ప్రభుత్వ రాజా ముద్ర, రాష్ట్ర గీతం, టీఎస్ ను టీజీ గా మార్చడం తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి రాష్ట్ర మంత్రి మండలి లో ఒక మైనార్టీ నాయకుడికి కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు అత్యవసరంగా ఉన్న రేషన్ కార్డుల పంపిణీ ఆయా రకాల పెన్షన్లను పంపిణీ వెంటనే చేపట్టాలని సూచించారు. లేనియెడల బీఆర్ఎస్ మైనార్టీల విభాగం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికబద్ధమైన రీతిలో ముందుకెళ్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News