ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌తో బీజేపీకి ఒప్పందం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్‌కు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ఐదేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు.. వాళ్ళంతట వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటే వాళ్ళదే బాధ్యత అని అన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీ ఉపేక్షించే పరిస్థితి ఉండదన్నారు. బీఆర్ఎస్ చచ్చిన పాము అని.. బీఆర్ఎస్‌ను బీజేపీ బతికించదని ఎంపీ లక్ష్మణ్్ స్పష్టం చేశారు.