నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 18 : రాజకీయంగా రెండు ఎంపీ టికెట్లతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ మాదిగలకు కేటాయించిన బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల్లో అండగా ఉంటామని.. మాదిగల రాజకీయ అస్తిత్వాన్ని ఉనికిని చంపేసిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా పాతాళంలో బొంద పెడతామని ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ శనిగారపు రవి మాదిగ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని జాఫ్రాపూర్ గ్రామంలో గురువారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అబద్ధపు కళ్లి బొల్లి మాటలను మాదిగ జాతి ప్రజలు విశ్వసించారని హెచ్చరిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు మాలలతో కుమ్మక్కైయ్యారని ఆరోపించారు. మాదిగలతో పెట్టుకున్న రేవంత్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా వాడవాడనా ‘గో బ్యాక్ కాంగ్రెస్’.. నినాదంతో చావు డప్పు కొట్టడం ఖాయమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ వారిని అయన హెచ్చరించారు.
ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదా లో మీరు ఎమ్మార్పీఎస్ ఉద్యమంపై మంద కృష్ణ మాదిగ పై నీతి నిజాయితీగా మాట్లాడు.. అబద్ధపు మాటలతో పిట్టలదొరలాగా మాట్లాడితే.. నీ ఆటలు సాగవు.. నీలాంటి ముఖ్యమంత్రులను ఎందరినో చూసిన చరిత్ర ఎమ్మార్పీఎస్ దని చెప్పారు. గుర్తుపెట్టుకో.. యావత్తు మాదిగ ఉపకులాల ప్రజలు కాంగ్రెస్ కు ఒక్క సీటు కేటాయించకుండా 80 లక్షల మంది మాదిగలకు చేసిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి మాదిగ వాడలకు రానివ్వకుండా తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా జిల్లా నాయకురాలు మరుకుంట సునీత, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకురాలు భాగ్యలక్ష్మి, మాదిగ సోన్ మండల అధ్యక్షుడు ఎమ్మార్పీఎస్ తొండకూరి సాయన్న, మాదిగ బరికుంట సాయి మాదిగ, తదితరులు పాల్గొన్నారు.