ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 17 సీజన్ ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐపీఎల్ 2024 మార్చి 22న ఆరంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ ఆరంభించాయి. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అయితే హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో ఎప్పుడో ప్రాక్టీస్ షురూ చేసింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ మంగళవారం చెన్నైలో అడుగుపెట్టాడు.
ఐపీఎల్ 2024 నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలే ప్రాక్టీస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. పలువురు ప్లేయర్లు ఇప్పటికే చెన్నై చేరుకొనిప్రాక్టీస్ చేస్తుండగా.. తాజాగా ఎంఎస్ ధోనీ కూడా ఎంట్రీ ఇచ్చాడు. మహి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న సీఎస్‌కే ఫ్రాంఛైజీ.. ‘తలా దర్శనం’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ధోనీ ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.