ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ముంబై 42వ సారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. వాంఖడే స్టేడియంలో విదర్భతో జరిగిన ఫైనల్‌లో 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులు చేయగా, విదర్భ 105 పరుగులకే చాపచుట్టేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని విదర్భ ముందు 537 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 368 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబై 169 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. అలాగే ముంబై తన ఖాతాలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను వేసుకుంది.