ప్రతిపక్షం, దుబ్బాక, ఏప్రిల్ 5: చెత్త కుప్పలతో ఇబ్బందులు ‘ప్రతి పక్షం’ వార్త కథనంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. దుబ్బాక మున్సిపాలిటీలోని గ్లోబల్ స్కూల్ శ్రీబాలాజి దేవాలయం ఎదురుగా చెత్త కుప్పలు నిల్వ ఉండటంతో వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురువారం వచ్చిన వార్తపై మున్సిపల్ అధికారులు స్పందిస్తూ.. శుక్రవారం అక్కడ నిల్వ ఉన్న చెత్తను తొలగించి సమస్యను పరిష్కరించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత వార్డులో నెలకొన్న నూతన మురికి కాలువల నిర్మాణానికి తగు చర్యలు చేపడ తామని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు.