Trending Now

ఖానాపూర్‌లో ముస్లింల నిరసన..

పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అవమానపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వినతి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 31: ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ ను ఉత్తరకాండ్ రాష్ట్రం లో అవమానించిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు ఖానాపూర్ ఎస్సై లింబాద్రి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్తరకాండ్ రాష్ట్రానికి చెందిన ఎక్స్ ముస్లిం సమీర్ అలియాస్ సిద్ధార్థ చతుర్వేది అనే వ్యక్తి తమ ఇస్లాం పవిత్ర గ్రంధాన్ని కాలితో తొక్కుతూ పేజీలను చింపి కాల్చివేసి తమ మనోభావాలను కించపరచాడన్నారు. ఇస్లాం పై విద్వేషపూరిత ప్రచారం చేస్తూ తమ ధర్మానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఇలాంటి సంఘటనలు దేశంలో ఎక్కడ కూడా పునారావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ను అవమానించేవారు ప్రపంచంలో ఎక్కడ కూడా భవిష్యత్తు జీవితాన్ని ప్రశాంతంగా గడిపిన సందర్భాలు లేవన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే పవిత్ర ఖురాన్ ను ఈ తరహాలో అవమానించడం కాకుండా ఇస్లాం మతం గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న సదరు వ్యక్తిపై చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకొని దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా దేశ పోలీస్ శాఖపై ఉందని చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై పోలీస్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు మౌలానా శేఖ్ రైస్,మౌలానా బిలాల్ ,న్యాయవాది అడ్వకేట్ ఖాజా,జియా,సయ్యద్, అబిద్, మున్ను, హమీద్, అమీర్ ,సద్దాం, జీషాన్ తదితరులున్నారు.

Spread the love

Related News

Latest News