Muttiah Muralitharan About Test Cricket: శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం క్రికెటర్లు ఎక్కువగా పొట్టి ఫార్మాట్‌లపైనే దృష్టి సారిస్తున్నారని, దీంతో తన రికార్డు దరిదాపుల్లోకి కూడా ఎవరూ రావడం లేదని మురళీధరన్ అన్నాడు. అలాగే టెస్ట్ క్రికెట్ విషయంపై ఆందోళన చెందాడు. ప్రతి దేశం ఏడాదిలో ఆరు లేదా ఏడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతోందన్నారు.
కాగా, టెస్ట్ క్రికెట్ చరిత్రలో మురళీధరన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఆయన ఏకంగా 800 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి స్థానంలో దివంగత లెట్ స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్లు తీశాడు. అలాగే ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్ 704 వికెట్లు తీసి మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో నాథన్ లైయన్(530), అశ్విన్(516) ఉన్నారు. వీరంతా రెండు లేదా మూడేళ్లు మాత్రమే ఆడేఅవకాశం ఉండడంతో 800 వికెట్లు తీయడం కష్టమేనని అంటున్నారు.