ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సాక్ష్యాధారాలు ఉన్నా వివేకా హంతకులు నేటికీ తప్పించుకొని తిరుగుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ‘చిన్నాన్నను దారుణంగా చంపితే గుండెపోటుతో చనిపోయారని ‘సాక్షి’లో చూపించారు. ప్రజలు హర్షించరని తెలిసి కూడా అవినాశ్ రెడ్డికే జగన్ టికెట్ ఇచ్చారు. నేను MPగా పోటీ చేయాలనేది చిన్నాన్న చివరి కోరిక. అందుకే ఆయనను కక్షగట్టి హతమార్చారు. YCP నిందితులకు టికెట్ ఇచ్చింది. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా’అని చెప్పారు.