ప్రతిపక్షం, ఏపీ: రెండు రోజుల్లో తాను చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. దేవినేని ఉమతో తనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని, అధిష్థానం సమక్షంలో దేవినేనితో అన్నీ మాట్లాడుతామని చెప్పారు. వైలవరం టికెట్ ఇస్తామంటూనే చంద్రబాబు, లోకేష్ ను దూషించాలని జగన్ చెప్పారని తెలిపారు. వైసీపీలో ఉండలేక టీడీపీలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.