నకిరేకల్ ఎమ్మెల్యే వేముల డిమాండ్..
మంత్రి జగదీశ్ రెడ్డి పై సంచలన ఆరోపణలు
ప్రజాపక్షం ప్రతినిధి, నకిరేకల్: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, ఆయన బినామీలు 1,50,000 ఎకరాల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఏ జిల్లా, ఏ ఊరు, ఏ సర్వే నెంబర్, బాధితులు ఎవరు అనేది లెక్కలతో సహా బయట పెడతానని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి త్వరలో లేఖ రాస్తానని అన్నారు. ఆక్రమించిన భూములను జప్తు చేసి పేదలకు పంచాల్సిందేనని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేశారు.