ప్రతిపక్షం, సినిమా: ఇటీవల దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన నాని త్వరలో ‘సరిపోదా శనివారం’ అనే ఆసక్తికర సినిమాతో రాబోతున్నాడు. నానితో అంటే సుందరానికి లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ప్రియక మోహన్ హీరోయిన్ గా నటించగా SJ సూర్య పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అంతేకాకుండా గ్లింప్స్ చివరిలో ఎస్జే సూర్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా ఆగస్టు 29న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది.