Trending Now

Nara Lokesh: బాత్రూమ్‌లలో హిడెన్ కెమెరాలు లేవు: లోకేశ్‌

Nara Lokesh Serious on Hidden Cameras: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఘటనపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు లేవని మంత్రి తెలిపారు. హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న కారణంగా తనను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా దుష్ప్రచారం జరుగుతుందన్నారు.

వీడియోలు లేవని, విద్యార్థులు క్యాంపస్ లో ఎక్కడా రహస్య కెమెరాలను చూపించలేకపోయారని మంత్రి లోకేష్ అన్నారు. మొత్తం సమస్య కల్పితంగా కనిపిస్తోందని, కొంతమంది వ్యక్తులు నలుగురు వ్యక్తులకు సంబంధించిన వివాదంపై గందరగోళాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేసి సెన్సేషన్ సృష్టిస్తున్నారన్నారు.

Spread the love

Related News

Latest News