Trending Now

నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ రిలీజ్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: హీరో నారా రోహిత్ ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ త్వరలో ప్రతినిధి 2 సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. నారా రోహిత్ కెరీర్ లో 2014లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ప్రతినిధి 2 టైటిల్ తో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో మరో పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది. ఆల్రెడీ గతంలో ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయగా ఇప్పుడు సడెన్ గా టీజర్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు.

చిరంజీవి చేతుల మీదుగా ‘ప్రతినిధి 2’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో.. పొలిటికల్ అంశాలనే ఎక్కువగా ప్రస్తావించారు. అభివృద్ధి, రాష్ట్ర అప్పు లాంటి అంశాలపై కామెంట్స్ చేసారు. చివర్లో వచ్చి ‘ఓటేయండి, లేదా దేశం వదిలి వెళ్లిపోండి, లేదా చచ్చిపోండి’ అని సీరియస్ గా నారా రోహిత్ డైలాగ్ చెప్పారు. అయితే ఈ సినిమా మాత్రం వచ్చే ఏడాది 25 జనవరి 2024 రిలీజ్ చేయనున్నారు.

Spread the love

Related News

Latest News