నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 15 : వినూత్నమైన విన్యాసాలు.. శోభాయమానమైన ప్రదర్శనలు.. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడు కూడా నిర్మల్ జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో అగ్నిమాపక వాహనంతో ప్రమాదాలు సంభవించినప్పుడు.. ఆస్తులను, ప్రాణాలను అగ్నికి ఆహుతి కాకుండా సిబ్బంది చేసే ప్రయత్నాలు, సహాసాలు విన్యాసాలు.. ప్రదర్శనల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా అమర అగ్నిమాపక శాఖ పోలీస్ ఉద్యోగులు సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా అగ్నిమాపక శాఖ దళాధిపతి జయత్ రాం మాట్లాడుతూ.. తమ విధి నిర్వహణలో అనుక్షణం ప్రజల ఆస్తులు, ప్రాణాలను కాపాడేందుకు అప్రమతమై ఉంటామని దేశంలో ఎలాంటి వార్త తమకు సమాచార రూపంలో అందుతుందోనని సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మేన్ లు అశోక్, శ్రీనివాస్ డ్రైవర్ ఆపరేటర్లు రవి, హుస్సేన్ షా, ఫైర్ మేన్ లు నవీన్ రెడ్డి, అజయ్, కుమార్ రాజు నగేష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.