తెలంగాణలో 12 ఎంపీ సీట్లను గెలుచుకుంటాం..
నిర్మల్, (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ప ఏప్రిల్ 15 : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలోనే దేశం అన్ని రంగాలలో పురోగతిని సాధించిందని.. అన్ని వర్గాల నుంచి తమ లోకసభ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభిస్తున్నదని బిజే ఎల్బీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారానికి అయిన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పదేళ్ల మోడీ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. టిస్రీ బార్ భి మోడీ సర్కార్.. అప్ కీ బార్ చార్ సౌసే సర్కార్.. అనే నినాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి ప్రచార కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి సముచిత ప్రధాన త లభిస్తుందని.. తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి ఆదిలాబాద్ పార్లమెంటరీ కన్వీనర్ అయ్యన్న, భూమయ్య, పెద్దపెల్లి ఇన్చార్జ్ రావుల రాంనాథ్, బిజెపి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంజు కుమార్ రెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, పట్టణ బిజెపి అధ్యక్షులు సాదం అరవింద్ నాయకులు భూపాల్ రెడ్డి ,భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు.