ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు చెబుతున్న విషయాలు సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. BRS నాయకులు అగ్రనాయకత్వం తీరుతెన్నుల్ని ఒంట బట్టించుకొని వివిధ జిల్లాల స్థాయిలో కూడా ఇదే వ్యవహారం నడిపారని విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారం ఆధారంగా మహబూబ్ నగర్ MLA యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ రోజు (26 March 2024) మూడు గంటలకు రాష్ట్ర DGP ని కలవబోతున్నారు. ఫోన్ టాపింగ్ కి సంబంధించి ఇంకా లోతైన విచారణ జరపాలని.. ఆయన DGP ని కోరనున్నారు. దాంతోపాటు మహబూబ్ నగర్ పరిధికి సంబంధించి తమకు దొరికిన ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. ఫోన్ టాపింగ్ కేసు విచారణ పరిధి, విస్తృతిని పెంచాలని డీజీపీకి వినతి పత్రం అందజేయనున్నారు.