ప్రతిపక్షం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష్య బరిలో నిలిచేందుకు ట్రంప్ తో పోటీ పడుతున్న నిక్కీ హేలీ తొలి ప్రైమరీ విజయాన్ని సాధించారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఆమె గెలిచారు. ఇప్పటి వరకు ట్రంప్ దే పై చేయి కాగా.. తొలిసారిగా నిక్కీకి ఊరట లభించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలవాలంటే మొత్తం 1215 మంది ప్రతినిధుల్ని సొంతం చేసుకోవాల్సి ఉండగా ట్రంప్ ఇప్పటికే 244 మార్కుకు చేరుకున్నారు. నిక్కీ వెంట కేవలం 24 మంది మాత్రమే ఉన్నారు.