Trending Now

ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్‌ కుమార్ ప్రసాద్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్‌కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావ‌ర‌ణ‌, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, తన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ జవహర్ రెడ్డి చేతుల మీద జరపడానికి చంద్రబాబు విముఖతతో ఉన్నారని.. అందుకే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరించారనేది జవహర్ రెడ్డి మీదున్న అభియోగం. జవహర్ రెడ్డిని తప్పించాలని ఎన్నికల సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా సార్లు ఫిర్యాదు చేశాయి కూటమి పార్టీలు.

Spread the love

Related News

Latest News