నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ) ఏప్రిల్ 16 : అదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి తారక రామారావు పార్లమెంటరీ బూత్ స్థాయి కమిటీల సమావేశానికి నిర్మల్ నుంచి బీఆర్ఎస్ నాయకులు పెద్ద మొత్తంలో తరలి వెళ్లారు. మాజీ డీసీసీబీ చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, నిర్మల్ పట్టణ అధ్యక్షులు మారుగొండ రాములు ఆధ్వర్యంలో పలువురు ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు, నిర్మల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ నుండి పార్టీ కండువాలు వేసుకుని జై తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ.. వెళ్లారు.
ఇందులో మాజీ డీసీసీబీ అధ్యక్షులు రాం కిషన్ రెడ్డి, మాజీ రాష్ట్ర హాజీ కమిటీ సభ్యులు మహమ్మద్ నజీరుద్దీన్, నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మారుగొండ రాము, జెడ్పి కోఆప్షన్ సభ్యులు యు.సుభాష్ రావు, సయ్యద్ ఖాజా అక్రం అలీ, మహమ్మద్ బిన్ అలీ, మహమ్మద్ ఫిర్దోస్, మసూద్ ఖాన్ చారి, మహబూబ్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.