నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 16 : కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ కి మాతృమూర్తి కీ.శే. అనుసుయ ఇటీవల స్వర్గస్తులవ్వగా మంగళవారం నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లా పోతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ మండల అధ్యక్షులు ఎమ్మరి గంగాధర్లు ఆయనను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఆత్మశాంతికై ప్రార్థన చేశారు. మధుయాష్కి మనోధైర్యంతో ఉండాలని చెప్పారు.