Trending Now

ఏకరూప దుస్తుల తయారీని వేగవంతం చేయాలి

నిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సాంగ్వాన్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 29 : ఏకరూప దుస్తుల తయారిని వేగవంతం చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని మంజులాపూర్ లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్థులు తయారు చేస్తున్న టైలరింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియ అత్యంత నాణ్యవంతంగా చేయాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి తీసుకున్న కొలతల ప్రకారమే దుస్తులను సిద్ధం చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభానికిముందే విద్యార్థులకు దుస్తులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య, ఇప్పటివరకు తయారైన, తయారు కావాల్సిన వాటి వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సిద్దాపూర్ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. అమ్మ ఆదర్శపాఠశాల పనులు జూన్ 5వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, పెండింగ్ పనుల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. పనులన్ని పారదర్శకంగా పూర్తి చేయాలని, కొనుగోలు చేసిన సామాగ్రి, పూర్తి చేసిన పనులకు సంబంధించిన వివరాలను పకడ్బందీగా రిజిసస్టార్ లలో నమోదు చేయాలన్నారు. పనులకు నాణ్యవంతమైన వస్తువులను ఉపయోగించాలని, మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, నీటిసరఫరా, విద్యుత్, త్రాగు నీటి సౌకర్యాలు, స్లాబ్ ల మరమ్మత్తులు, గ్రిల్స్ ఏర్పాటు, పెయింటింగ్ వంటి పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

అనంతరం సోన్ మండలం న్యూ వెల్మల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కలెక్టర్ పరిశీలించి, నిర్ణిత గడువులోగా పాఠశాల మరమ్మత్తు పనులు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను త్వరగా పూర్తి చేసి పాఠశాలకు పెయింటింగ్ పనులు ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో డీఈవో రవీందర్ రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రాజు, మేప్మా పీడీ సుభాష్, పంచాయితీ రాజ్ ఈఈ శంకరయ్య, మండల విద్యాశాఖ అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News