నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 16 : పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఈద్ గాం, మంచిర్యాల చౌరస్తా లోని కూడళ్లను, డ్రైనేజిలను పరిశీలించి అధికారులకు ఆయన పలు సూచనలు చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రధాన్యతనివ్వాలని పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు.
ప్రధాన కూడళ్ళు, రహదారులు, డ్రైనేజిలను శుభ్రంగా ఉంచాలని అన్నారు. రోడ్లపై చెత్త వేస్తే షాప్, హోటల్, మాల్స్, హాస్పిటల్స్ యజమానులపై అపరదా రుసుము విధించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వందశాతం ఆస్తి పన్నువసూలును పూర్తి చేయాలనీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.