ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి ఏప్రిల్ 5: నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలంలోని బోరిగం గ్రామంలో ఉన్న ప్రభుత్వ గోదాములను నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. వేహింగ్ మిషన్ ఇతర పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గోదాంలో ఉన్న నిల్వలు ఇతర సౌకర్యాలు సదుపాయాలను వ్యక్తిగతంగా పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.