జిల్లా అధికారి జాదవ్ పరుశురాం..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21 : ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్మల్ జిల్లా ఇంటర్మీడియట్ మాధ్యమిక అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలు తెలిపారు. జిల్లాలో 13 ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. పరీక్షలు రెండు దఫాలుగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు అర్హులైన విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్లో ద్వారా స్వీకరించాలని కోరారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 13 కేంద్రాలే ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.