Trending Now

ఆయనని ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకు..

నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది అల్లూరి కృష్ణవేణి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 29 : దేశంలో సుస్థిరమైన కాంగ్రెస్ పాలనను తెచ్చేందుకు రాహుల్ గాంధీని మనమంతా కలిసి ప్రధానిని చేస్తేనే అది సాధ్యమని నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ప్రముఖ న్యాయవాది కృష్ణవేణి సోమవారం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో ఆమె తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ కేంద్రంలో అమ్మయాల్లోకి వస్తే అన్ని వర్గాలకు వినూత్నమైన సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతి ఏడాది ప్రతి మహిళకు లక్ష రూపాయల చొప్పున నగదు సహాయం అందించేందుకు ప్రణాళిక రూపొందించుకుందని చెప్పారు. మహిళలందరినీ లక్షాధిపతులు చేసే లక్ష్యం ఒక కాంగ్రెస్ కే ఉందన్న విషయాన్ని గుర్తించాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించినట్లే అన్ని వర్గాల వారు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్టు అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు భారీ ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.

జాతీయ ఉపాధి హామీ పథకం ను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ దేనన్నా విషయాన్ని గుర్తించాలన్నారు. పదేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో అమాయక భారతీయులందరూ మోసపోయారే తప్ప ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేసి దేశాన్ని అప్పులపాలు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీని అన్ని వర్గాల వారు గుర్తించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోన్ మండల అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజనరసింహ రెడ్డి, మండల నాయకులు వాసవి, సాయి కృష్ణ, గంగాధర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News