నిర్మల్ జిల్లా మాస్టర్ ట్రైనర్ శ్రీనివాస్..
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 16 : పార్లమెంట్ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం(ఎఫ్.ఎస్.టీ), వీడియో వివింగ్ టీం ( వీవీటి), స్టాటిక్స్ సర్వేలయిన్స్ టీం (ఎస్.ఎస్.టీ) లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమల్లో ఓటర్లను ప్రలోభపెట్టే వాగ్దనాలు ఎన్నికల సంఘం చట్టాలకు విరుద్ధమని, వాటిని నియంత్రించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులెవరు పార్టీలకు అనుకూలంగా కార్యక్రమాలలో పాల్గొన్న రాదని, సామాజిక మాధ్యమాల్లో పార్టీల అనుకూల, వ్యతిరేఖ పోస్టులు పెట్టరాదని అన్నారు.
ఎన్నికలకు 48 గంటల ముందు నుంచి ఎటువంటి ప్రచార కార్యక్రమాలకు అనుమతి లేదని అన్నారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో పార్టీల ప్రచారం నిషేధమని తెలిపారు. రాత్రి 10 గంటలు దాటితే ఎన్నికల ప్రచారం చేయరాదని అన్నారు. సరైన పత్రాలు లేకుండా 50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని తెలిపారు. అనంతరం సీ విజిల్ యాప్ పై, ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్ 1950 పై అధికారులకు ఈడీఎం నదీమ్ అవగాహనా కల్పించారు. సీ విజిల్ లో వచ్చిన ఫిర్యాదులపై ఖచ్చితంగా వంద నిమిషాల్లోపు పరిష్కరించేలా ఉండాలని అన్నారు. సీ విజిల్ యాప్ అంశాలపై క్లుప్తంగా వివరించారు. ఈ ఎస్ఎంఎస్ యాప్ గురించి అధికారులకు అవగాహనా కలిపించారు. వాహనాల తనిఖీల సమయంలో పట్టుబడ్డ నగదు, ఇతర వస్తువులకు సంబందించిన వివరాల నమోదు ప్రక్రియను వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీ ఎల్ ఎం టీ లు శ్రీనివాస్, ఎఫ్.ఎస్.టీ లు, వివిటీ లు స్టాటిక్స్ ఎస్.ఎస్.టీ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.