మానవత్వం చాటుకున్న పోలీసన్నలు..

ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : మానసికంగా కృంగిపోయి మతిస్థిమితం కోల్పోయి పాడుబడ్డ చిరు దుస్తులతో తిరుగుతున్న ఓ మహిళను గమనించిన నిర్మల్ హోంగార్డుల సంఘం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అజహర్ ఖాన్, రాథోడ్ అనిల్ లు ఇతర మహిళల సహాయంతో పట్టుకొని మహిళల సహాయంతో కొత్త బట్టలు ధరింపజేశారు. సుమారు వారం రోజులుగా నిర్మల్ పట్టణంలోని ఆయా ప్రాంతాలలో చినిగిపోయిన చిరు దుస్తులతో తిరుగుతున్న ఈమెను మానవత్వంతో గుర్తించి నవ వస్త్రాలు ధరింపజేసినట్లు ఆయనతోపాటు పోలీస్ సిబ్బంది ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలీసన్నలు చేసిన ఈ మహోన్నతమైన కార్యానికి స్థానికులు సలాం కొడుతున్నారు.

Spread the love

Related News