Trending Now

మీకు మేమున్నామని ‘భరోసా’..

నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ : నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఐఐఐటి బాసర పూర్వ విద్యార్థి అయిన ఎస్సై జ్యోతిమణి శుక్రవారం ఐఐఐటీ బాసర కి వెళ్లి విద్యార్థులను కలవటం జరిగింది. ఇటీవల జరుగుతున్న పరిణామాల గురుంచి తెలుసుకుని ఒత్తిడిని ఎలా అధిగమించాలో క్షుణ్ణంగా వివరించటం జరిగింది. ఒత్తిడిని అధిగమించి ఐఐఐటి లో గల అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని.. మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పారు. దేశంలో ఐఐఐటి లో చదివిన వారికి బయట మంచి అవకాశాలు వస్తాయని వివరించారు. ఏదైన కోల్పోయిన తిరిగి తెచ్చుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి తెచ్చుకోలేమని.. మానసిక ఒత్తిడిని ఎలా అధికమించాలో ఉదాహరణలతో వివరించారు. మీకు ఎల్లప్పుడూ మేము ఉన్నామని నిర్మల్ జిల్లా పోలీసులు, భరోసా సిబ్బంది భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా భరోసా ఇన్చార్జి ఎస్సై జ్యోతిమణి, సిబ్బంది, విద్యార్దులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News