Trending Now

కాంగ్రెస్ మోసాలకు ప్రజలు లొంగరు..!

బీజే ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 6: తుక్కుగూడలో ఏర్పాటుచేసిన సభ ద్వారా కాంగ్రెస్ ప్రజలను మరో మారు మోసగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని.. వారి అబద్ధపు హామీలను చమత్కారాలను ప్రజలు నమ్మరని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నిర్మల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయినా మాట్లాడారు. గత ఎన్నికలలో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కనీసం మూడు హామీలు కూడా నాలుగు నెలలలో అమలు చేయకపోవడమే కాకుండా మరోమారు జాతీయస్థాయిలో హామీల పేరుతో తుప్పుగూడలో సభ పెట్టి మోసగించేందుకు ప్రయత్నం చేయడం దారుణం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ప్రజలు లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ కు తగిన విధంగా గుణపాఠం చెప్తారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని నిర్మల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని ఆయా వర్గాలలో అధిష్టానం ఆదేశాల మేరకు ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. భారతదేశ అని ఏలే సత్తా సామ్యార్థం బీజేపీ కే ఉందని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారని ఆయన తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాలను పోలింగ్ బూత్ లో వారీగా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర బీజేపీ కమిటీలు ఇచ్చిన ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో 12 బీజేపీ ఎంపీ సీట్లను గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని అధిష్టానం ఆదేశాలు సూచనలకు అనుగుణంగా ముందుకెళుతున్నదని తెలిపారు.

నిర్మల్ భూఆక్రమణదారులను విడిచి పెట్టేది లేదు..

గత ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజాప్రతినిధుల అనుచరులు చేపట్టిన భూ ఆక్రమణాలు,అక్రమ కట్టడాల నిర్మాణాలు, డి-1 పట్టాల విషయంలో తాను సీరియస్ గానే ముందుకు వెళుతున్నానని బీజే ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ లో జరిగిన భూ ఆక్రమాణాలు, అక్రమ కట్టడాలు డి-1 పట్టాల విషయంలో ఆధారాలతో సహా సంబంధిత శాఖల అధికారులకు విన్నవించుకున్న చర్యలు తీసుకోవడంలో చేస్తున్న ఆలస్యం.. నిర్లక్ష్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, పెద్దపల్లి ఇంచార్జ్ రావుల రాంనాథ్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య,, ప్రధాన కార్యదర్శిలు మెడిసిమ్మ రాజు సామ రాజేశ్వర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, గంగారెడ్డి, బాపురెడ్డి ,చందు మహమ్మద్ జమాల్, ప్రజోత్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News