Trending Now

దేశాన్నిఏలే సత్తా బీజేపీకే ఉంది..

నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 6 : దేశాన్ని ఏలే సత్తా సామర్థ్యం భారతీయ జనతా పార్టీకే ఉందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన భరతమాత ఫోటోకు పూలమాలలు వేసి పార్టీ జెండాను ఎగురవేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కట్టుదిట్టమైన సిద్ధాంతాలతో ధర్మ పరిరక్షణ భవిష్యత్తు కార్యచరణతో బీజేపీ ఆవిర్భావించిందన్నారు. అలాంటి ఈ పార్టీ ప్రపంచంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న స్థాయికి చేరుకున్నదని చెప్పారు.

సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ప్రపంచంలోనే అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోతూ దేశ సమైక్య సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, పెద్ద పెల్లి ఇంచార్జ్ రావుల రాంనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మెడిసిమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, నిర్మల్ పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, గంగారెడ్డి మహమ్మద్ జమాల్, చందు, బాపురెడ్డి సుధాకర్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News