నిర్మల్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేందర్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 25 : నిర్మల్ మహబూబ్ కాట్లపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఒకరు మృతి చెందడం, పలువురికి గాయాలవడం తనను బాధించిందని నిర్మల్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేందర్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వాహాన యజమానులు, చోధకులు పోలీస్, రోడ్డు రవాణా ఇతర శాఖల నియమ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎలాంటి వారైనా వారిపై చట్టప్రకారం కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరికీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహబూబ్ ఘాట్ పై ట్రావెల్ బస్సు బోల్తా పడడం ఇలాంటి సంఘటనను పునారవృత్తం కాకుండా ఇకనుండి కఠినమైన రీతిలో ప్రణాళిక బద్ధమైన పద్ధతులలో ముందుకెళ్తామని చెప్పారు.
వాహనాలకు సంబంధించిన ఆయా శాఖల అధికారిక ధృవీకరణ పత్రాలను ఎప్పటికప్పుడు పున:పరిశీలించుకుని కాలానికి అనుగుణంగా నవీన పద్ధతులలో సరిచేసుకుని వాడాలన్నారు. వాహనాలు నడపడమే కాకుండా వాహనాల కండిషన్ తదితర విషయాల పట్ల దృష్టి పెట్టి వాహనాలను నడపాలని సూచించారు. నిర్మల్ లోని అన్ని ప్రాంతాలలో ఇప్పటినుండి వాహనాల కండిషన్ లను నిత్య పరిశీలన చేస్తూ, కాలం చెల్లిన వాహనాలను గుర్తించి సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. భారీ, గూడ్స్ వాహనాలకు ఏ రూట్ లలో అయితే అనుమతులు ఉన్నాయో అదే రూట్ లో ఉండి వెళ్లాలని జన సమూహం ఉన్న ఇరుకైన రోడ్లలో రావద్దని హెచ్చరించారు. అతివేగం కారణంగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లపై నిర్ణీత వేగానికి అనుగుణంగానే వాహానాలను చోధకులు నడపాలని సూచించారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇతర గూడ్స్ వాహనాలపై ప్రత్యేకంగా పెట్టి స్పెషల్ డ్రైవ్ ద్వారా తగ్గిన విధంగా ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడంతో పాటు హెచ్చరికలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.