నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 15 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవలే బీఆర్ఎస కు రాజీనామా సమర్పించుకున్న నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మరి కొంతమంది కౌన్సిలర్లు నిర్మల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం కలిశారు. డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు, కాంగ్రెస్ యువజన సీనియర్ నాయకులు సయ్యద్, అర్జుమంద్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను ముఖ్యమంత్రికి పరిచయం చేయగా.. రాష్ట్ర మంత్రి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు నిర్మల్ పట్టణ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు ఉన్నారు.