Trending Now

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్లు..

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: నిర్మల్ జిల్లా కేంద్రంలోని వార్డ్ నెంబర్ 8 మున్సిపల్ కౌన్సిలర్ నల్లూరి పోశెట్టి, వార్డ్ నెంబర్ 16 మున్సిపల్ కౌన్సిలర్ శ్రీవాణి రఘువీర్ లు శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు నివాసంలో ఆయన సమీక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. నల్లూరి పోశెట్టి తారక శ్రీ వాణి రఘువీర్లు గతంలో కూడా పలుమార్లు కాంగ్రెస్ పార్టీలో ఆయా పదవులు నిర్వహించి మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొందారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుటు కూచాడి శ్రీ హరిరావు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో “కారు” కనిపించకుండా చేస్తాన్నారు. అహంకార ధోరణితో పదేండ్ల కేసీఆర్ పాలనతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడి అప్పుల పాలైందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఇస్తున్న ఆదేశాల మేరకు వార్డులు, గ్రామాలు, ప్రాంతాలవారీగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్న గారి పోశెట్టి, కొట్టే శేఖర్ ,రమేష్ ,సబాకలీం రాజేశ్వర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News