ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఉదయం పంచామృత అభిషేకం, పల్లకి సేవ, పల్లకి ఆలయ ప్రదక్షణ, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రసిద్ధ చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానంలో వేద పండితులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులకు ఆశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆ మెడ శ్రీధర్ మాట్లాడుతూ.. భక్తులు ప్రతి శనివారం అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య తమ కోరికలు తీర్చుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయా రూపాలలో నైవేద్యాలను సమర్పించుకోవడం అభినందనీయమన్నారు. భక్తులు, ధర్మకర్తల సహాయ సహకారాలు, వేద పండితుల సలహాలు తీసుకుంటూ ఆలయంలో ప్రతి శనివారం ఈ తరహ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
గతంలో ఎన్నడు లేని విధంగా దేవరకోట దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రెండు సంవత్సరాలుగా చేపడుతున్న కార్యక్రమాలకు అనుగుణంగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నదని చెప్పారు. ప్రత్యేక పండగలు పవిత్ర దినాలను పురస్కరించుకొని ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దడంతో పాటు వేద పండితుల సలహాలు సూచనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఆ సౌకర్యాలు కలగకుండా ప్రత్యేక పూజ కార్యక్రమాల నిర్వహణ అన్నదానము ఇతరత్రా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్, కార్యనిర్వాహణాధికారి కీషన్, ధర్మకర్తలు అయ్యన్న గారి శ్రీనివాస్, దార్ల రాజేశ్వర్, జాప అనిల్, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.