Trending Now

Nirmal SP Janaki Sharmila: చెడుపై మంచి సాధించిన విజయం: ఎస్పీ డా.జి.జానకి షర్మిల

  • సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ
  • పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పనిచేయాలని సూచన
  • జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

నిర్మల్: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని నిర్వహించుకుంటారని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సాయుధ దళ కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శక్తికి రూపమైన ఆయుధాలకు ఆయుధ కర్మాగారంలో జిల్లా ఎస్పీ పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా పోలీస్ పెట్రోల్ పంప్‌లోనూ జిల్లా ఎస్పీ పూజలు చేశారు. పోలీస్ పంపు 20 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు విజయ దశమి బోనస్‌ను ఎస్పీ చేతులమీదుగా అందజేశారు. అనంతరం జిల్లా పోలీసులుకు ప్రజలకు ఆమె విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగాలి..
విజయదశమి ఉత్సవం విజయాలకు ప్రతీకగా అభివర్ణించారన్నారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని, అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి సందర్భంగా అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకోవడంతోపాటు పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. పండగను అందరూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ముఖ్యంగా నవరాత్రులు పూజలందుకున్న దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం కూడా ప్రశాంత వాతావరణలో నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సూర్య నారాయణ, ఏఎస్పీ అవినాష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, రామకృష్ణ, ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రాంనిరంజన్, శేఖర్, రమేష్, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, సాయుధ ధళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News