ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 23 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రాచీన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట లో ప్రతి యేట నిర్వహించుకునే బ్రహ్మోత్సవాలు భాగంగా ఈ ఏడు కూడా ఆ ఉత్సవాలను నిర్వహించేందుకు వినూత్నమైన రీతిలో ఆలయ కమిటీ వారు ముందుకెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం వారి బ్రహ్మోత్సవాల రథ శోభాయాత్ర ను నిర్వహించేందుకు ఈ ఏడు రెండు భారీ గుర్రాలను ఏర్పాటు చేశారు స్వామివారి రథం ముందు ముందుగా గుర్రాలను నడిపిస్తూ.. వేలాదిమంది భక్తులతో ఈ శోభాయాత్ర నిర్వహించినందుకు తగిన విధంగా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ తెలిపారు.