ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నార్వే చెస్ టోర్నీ-2024 విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచారు. ఫైనల్ రౌండ్‌లో ఫాబియానో కరువానాపై విజయం సాధించారు. కార్ల్‌సన్ నార్వే చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఇది ఆరోసారి. కాగా ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 9వ రౌండ్‌లో ఫాబియానో చేతిలో ఓడిపోయారు. మహిళల విభాగంలో జు వెన్జున్ (చైనా) టైటిల్‌ను గెలిచారు. ఈ టోర్నీలో కార్ల్‌సన్(17.5) తొలి స్థానం సంపాదించగా, నకమురా(15.5), ప్రజ్ఞానంద(14.5) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.