Trending Now

NTR: వరద బాధితులకు ఎన్టీఆర్‌ రూ. కోటి విరాళం

ఏపీ, తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల బీభత్సం తనను ఎంతగానో కలచి వేసిందని టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు తొందర్లోనే కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలకు తన వంతుగా చెరొక రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కాగా.. గత మూడు రోజులుగా ఏపీ, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడ, ఖమ్మం జిల్లాల్లో అయితే పరిస్థితులు దయనీంగా ఉన్నాయి. కుండపోత వానలు, భారీ వరదలతో పెద్దఎత్తున్న ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. ‘ఆయ్’ మూవీ యూనిట్ వారంతపు వసూళ్లలో 25 శాతాన్ని ప్రకటించింది.

Spread the love

Related News

Latest News