ప్రతిపక్షం, వెబ్డెస్క్: నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావుని ఈ రోజు గుర్తుచేసుకుంటూ.. వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు ‘భారతరత్న’ పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను’’అని ఎక్స్ లో పేర్కొన్నారు.