ప్రతిపక్షం, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ సెట్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. రెండ్రోజులుగా ఓ సాంగ్ షూట్ జరుగుతుండగా.. ఈరోజు ఉదయమే ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. రింగుల జుట్టుతో మెరున్ షర్టు ధరించిన తారక్ లుక్ ఆకట్టుకుంటోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.